బిజెపి అసెంబ్లీ తొలి జాబితా విడుదల

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు ఖరారైన వెంటనే బిజెపి తెలంగాణ ప్రాంత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 33 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితాను ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, కరీంనగర్ జిల్లాలో ఆరు, నిజామాబాద్ జిల్లాలో రెండు, మెదక్ జిల్లాలో రెండు, వరంగల్ జిల్లాలో నాలుగు, నల్గొండ జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక స్థానానికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. బిజెపి పోటీ చేసే అభ్యర్థుల జాబితా:ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్, చెన్నూర్, మంచిర్యాల, ముధోల్.కరీంనగర్ జిల్లా : కరీంనగర్, వేములవాడ, కోరుట్ల, సిరిసిల్ల, రామగుండం, హుస్నాబాద్,నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి,మెదక్ జిల్లా: సంగారెడ్డి, దుబ్బాకమహబూబ్ నగర్ జిల్లా : మహబూబ్ నగర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, షాద్ నగర్,నల్గొండ జిల్లా : నల్గొండ, మునుగోడు, ఆలేరువరంగల్ జిల్లా : వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ, భూపాలపల్లిహైదరాబాద్ : అంబర్‌పేట, ముషీరాబాద్, ఉప్పల్, మల్కాజిగిరి, కార్వాన్, ఖైరతాబాద్, మలక్‌పేట, గోషామహల్