గవర్నర్‌తో నాదెండ్ల మనోహర్ సమావేశం

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాలకు అసెంబ్లీలో ఏ భాగాన్ని ఎవరికి కేటాయించాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆయా పార్టీలకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.