నేడు తెలంగాణలో రాహుల్ పర్యటన
హైదరాబాద్, ఏప్రిల్ 20 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రా హుల్‌గాంధీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఆ యన మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు పిలపునిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నిజా మాబాద్ జిల్లా డిచ్‌పల్లికి మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అక్క డ నిర్వహించే బహిరంగసభలోనూ పాల్గొని ప్రసంగిస్తారు. ఈనెల 25న రా హుల్‌గాంధీ తెలంగాణలో మరోమారు పర్యటించనున్నారు. వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనే రాహుల్‌గాంధీ అనంతరం హైదరా బాద్‌లో నిర్వహించే రోడ్‌షోలోనూ పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహి స్తారు. అలాగే ఎల్బీస్టేడియంలో నిర్వహించే బహిరంగసభలోనూ రాహుల్ పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాహుల్‌గాంధీ ప్ర త్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయల్దేరి వెళ్తారు. ఇప్పటికే కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో సోనియాగాంధీ పాల్గొనగా ఆమె మెదక్‌లోనూ బహిరంగ సభ ద్వారా ప్రచారం నిర్వహిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఆమె తదుపరి పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రాహు ల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లను టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పర్యవేక్షించారు. పోలింగ్ జరుగనుంది.