ఎస్‌బీహెచ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతా
హైదరాబాద్, ఏప్రిల్ 25 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జూన్ 2న ప్రారం భం కానుంది. తెలంగాణ ప్ర భుత్వం తరపున లావా దేవీలు నిర్వహించేం దు కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో ఖాతా ఏర్పాటుకు గవర్న ర్ ఈ ఎస్‌ఎల్ నరసింహన్ అనుమతించారు. ఈమేరకు గవర్నర్ తరపున ఆర్థిఖ శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్. ప్రేమచంద్రారెడ్డి (బడ్జెట్ వ్యవహారాలు) ఆర్‌బీఐ తో ఒప్పందం చేసుకుంటారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజే య్ కల్లాం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉనికి లోకి వచ్చే జూన్ 2న కొత్త రాష్ట్ర శాఖ కూడా ప్రారంభం కానుంది. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఆర్‌బీఐతో ఖాతా ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐతో ఒప్పందం చేసుకున్న త ర్వాత ఖాతా ఏర్పాటు చేస్తారు. జూన్ 2 నుంచి తెలంగాణ సంచిత నిధి అమ ల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వ ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ ియా (ఎస్‌బీఐ)లో కొనసాగుతోంది. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో ఉన్న నగదును జనాభా ప్రాతిపదికన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఏర్పాటు చేసిన ఎస్‌బీహెచ్‌లో ఏర్పాటు చేస్తారు.