చిటికేస్తే వెయ్యి ముక్కలవుతవ్‌


కొడకా! తమాషాగా ఉందా?
పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కేసీఆర్‌ ఆగ్రహం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) :
మోడీని దూషిస్తే తాట తీస్తానంటూ హెచ్చరిం చిన సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవ న్‌ కల్యాణ్‌పై టీఆర్‌ఎస్‌ చీఫ్‌ తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. తాను చిటికేస్తే వెయ్యి ము క్కలవుతావ్‌! కొడకా తమాషాగా ఉందా అంటూ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో ని ర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ స్పందించారు. ‘వాడెవడో సినామా యాక్టర్‌ అట. వాడి సినిమాలు నేనైతే చూడలేదు. తెలం గాణ గడ్డ వరంగల్‌లో నా తాట తీస్తానని అన్నా డట. నన్ను రోజు పది కుక్కలు తిడతనే ఉంట యి. అయినా పట్టించుకోను. కానీ తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడాడు. నాలుగు రోజులాగితే ఎవడి తాట ఎవడు తీస్తడో తెలుస్తది’ అంటూ ధ్వజమెత్తారు. అలాగే మోడీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని పిచ్చివాడిగా అభివర్ణించాడు. పాలమూ రు ఎత్తిపోతల పథకం ద్వారా తాండూరు కరు వు ప్రాంతాలను పారదోలేందుకు కృషి చేస్తానని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. బిజెపి ప్రధాన అభ్యర్థిగా పోటీలో ఉన్న నరేంద్ర మోడీ తెలంగాణకు బద్ధ శత్రువని అన్నారు. ఆంధ్రులపంచ చేరి, వారి మాటలు విని తెలం గాణ ప్రజలకు దూరమయ్యారని విమర్శిం చా రు. 1+1+1 అంటే 3 అని అనుకుంటున్నా డ ని, తెలంగాణలో మూడు గుర్తులను పంగనామా లని ఆయన తెలియదని
వ్యాఖ్యానించారు. అరవై ఏళ్లుగా తెలంగాణ కోసం ఆందోళనలు, రాస్తారోకోలు, దిగ్బంధనాలు, ఉద్యమాలు, ఎందరో బలిదానాలవల్లనే తెలంగాణ ఏర్పాటైందని అన్నారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకే టీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదని, టీఆర్‌ఎస్‌ పార్టీయే తెలంగాణాను పాలించాలని నాయకులు, ప్రజలు తనన కోరిన తర్వాతే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని అన్నారు. ప్రజల కష్టాలు, బాధలు మోడీకి ఏంతెలుసని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని అన్నారు. ఆంధ్రుల పాలనలో ఎలాంటి అభివృద్ధి లేకుండా నలిగిపోయామని, ఇకపై స్వతంత్రంగా బతుకుదామని అన్నారు. మా తెలంగాణాను మేమే పాలించుకుంటాం అని కేసీఆర్‌ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. తెలంగాణను బంగారు భూమిగా మారుస్తానని అన్నారు. తాండూరు ప్రాంతంలో కందిపంట విస్తారంగా రైతులు పండిస్తారని, ఆ పంటకోసం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రైతులకు హామీనిచ్చారు. ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకమైందని, ప్రతి ఒటరు అభ్యర్థి విశ్వసనీయతను తెలుసుకొని ఓటువేయాలని అన్నారు. ఇప్పుడు పొరపాటుచేస్తే తిరిగి పూడ్చుకోలేమని అన్నారు. గిరిజన, ముస్లిం మహిళలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని, మహిళా గ్రూపులకు పది లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని అన్నారు. 125 గజాల స్థలంలో అన్ని సౌకర్యాలతో కూడిన గృహాన్ని నిర్మించి ఇస్తామని అన్నారు. ఇంతకు ముందు తీసుకున్న గృహ రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. వృద్ధులు, వితంతవులు, వికలాంగులకు వెయ్యి రూపాయలు పెన్షన్‌ చెల్లిస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వరర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మహేందర్‌రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎంపిగా పోటీ చేస్తున్న విశ్వేశ్వరెడ్డి తాత రంగారెడ్డి అని, ఆయన పేరుపైనే రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారని అన్నారు. తానే స్వయంగా విశ్వేశ్వరరెడ్డిని ఎంపి స్థానానికి పోటీచేయాలని కోరారని, వెంటనే అంగీకరించారని అన్నారు. అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి గట్టి బలమైన వ్యక్తి అని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుందే వ్యక్తిని, అలాంటి వ్యక్తిని ఏరికోరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయమని అడిగానని, అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారని అన్నారు. వీరిద్దరిని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.