గుజరాత్ మహిళ నిఘా వివాదంపై న్యాయమూర్తితో విచారణ : షిండే
సిమ్లా, మే 2 (జనంసాక్షి) :
గుజరాత్‌లో ఒక మహిళపై గూడ óచర్యానికి పాల్పడిన సంఘటనపై దర్యాప్తు కోసం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని నియమించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు హోం శా ఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. శుక్రవారం ఆయన సిమ్లాలో మీడియాతో మాట్లాడు తూ ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ జరు గుతున్న సమయంలోనే గుజరాత్ ‘స్నూప్‌గేట్’పై దర్యాప్తు జరిపేం దు కు న్యాయమూర్తిని నియమిస్తున్న ట్లు కేంద్రం ప్రకటించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ కీయ దురుద్దేశ పూరిత ఇలాంటి ప్రక్రియలో ఏ న్యాయమూర్తి భాగ స్వామి కాబోడంటూ బీజేపీ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అ యితే ఈ వ్యాఖ్యలను షిండే పనికి మాటలుగా కొట్టి పడేశారు. లోక్ సభ ఎన్నికల మధ్యలో న్యాయమూ ర్తిని నియమించాలని నిర్ణయించలే దని, ఇది నాలుగు నెలలకు ముం దే తీసుకున్న నిర్ణయమని
ఆయన పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ ఒక మహిళ జీవితంలోకి రహస్యంగా చొరబడిన తీరు తనను ఆందోళనకు గురిచేసిందని ఆయన తెలిపారు. మోడీ ప్రధాని అయితే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందోనని తాను ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ దీనిపై స్పందిస్తూ స్నూప్‌గేట్‌పై ఈనెల 16లోగా న్యాయమూర్తిని నియమిస్తామని చెప్పారు. బీజేపీ నాయకులు దీనిపై ఎందుకు ఆందోళన చెందుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏ న్యాయమూర్తి ఈ కేసు చేపట్టబోరని ఎందుకు బహిరంగ ప్రకటనలు చేస్తున్నట్లు అని నిలదీశారు. ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీపై దర్యాప్తు జరుపుతామని చెప్పారు. ఎంక్వైరీ కమిషన్ ఒకసారి ఏర్పడిందంటే మోడీని కాపాడేవారు ఇక ఎవరూ ఉండరని బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.