సుబ్రతారాయ్‌కి మళ్లీ చుక్కెదురు
బెయిల్ నిరాకరణ
డబ్బు చెల్లింపులపై ప్రతిపాదనతో రండి
సహారా గ్రూప్‌నకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) :
సహారా ఇండియా చీఫ్ సుబ్రతారాయ్‌కు సు ప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన బె యిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంగ ళవారం తిరస్కరించింది. తనను జ్యుడీషియల్ కస్ట డీకి తరలిస్తూ మార్చి 4న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాయ్ వేసిన పిటిషన్‌ను న్యాయస్తానం కొట్టివేసింది. తమ ఉత్తర్వులను సుబ్రతారాయ్, సహారా గ్రూప్ పెడచెవిన పెట్టాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు, శాట్ ఉత్తర్వులను కూడా సహారా గ్రూప్ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. మదుపు దారు లకు డబ్బు చెల్లింపుపై కొత్త ప్రతిపాదనలతో రావాలని న్యాయస్థానం సహారా గ్రూప్‌ను
ఆదేశించింది. మదుపుదారుల నుంచి భారీగా పెట్టుబడులు సేకరించిన సహారా గ్రూప్ తిరిగిచెల్లించలేదు. అయితే, మదుపుదార్ల డబ్బు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ రాయ్ పెడచెవిన పెట్టారు. ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరడంతో రూ.24 వేల కోట్లు ఇన్వెస్టర్లకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సహారా పాటించకపోవడంతో రాయ్‌తో పాటు మరో ఇద్దరిని కస్టడీకి పంపుతూ మార్చి 4న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 4 నుంచి సుబ్రతారాయ్ తీహార్ జైలులో ఉన్నారు. అయితే, సెబి ద్వారా ఎలాంటి ఫిర్యాదు రానప్పుడు తనను కస్టడీకి ఎలా పంపిస్తారని కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ కేఎస్ ఖేహార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సరికొత్త ప్రతిపాదనలతో వచ్చే వరకూ రాయ్ తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.