ఏఎస్పీ వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి

కడప (జ‌నంసాక్షి )  : కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఏఎస్పీ అప్పలనాయుడి వాహనంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఏఎస్పీ వాహనం ధ్వంసమైంది. సంఘటన స్థలం నుంచి ఏఎస్పీ వెనుదిరిగారు. తమ పోలింగ్ ఏజెంట్‌పై ఏఎస్పీ అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు రాళ్లతో ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు దేవగుడిలో భారీగా దిగారు.