కాకినాడలో ఓటేసిన పళ్లంరాజు

హైదరాబాద్ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లం రాజు కాకినాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. తాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న విభజన వ్యతిరేక సెంటిమెంట్‌ను కొంత పోగొట్టానని చెప్పారు. తాను తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.కాగా, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉందని అందరు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ నేత దీపక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే – తెదేపా సీనియర్ నేత అబ్ధుల్ ఘనీని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు రాప్తాడు టిడిపి అభ్యర్థి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ను వెంకటాపురంలో పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.