ఢిల్లీలో ఈసీ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారణాసిలో మోడీ సభకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వారణాసిలో కూడా బీజేపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.