కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మహంతి స‌మావేశం

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మహంతి భేటీ

న్యూఢిల్లీ :  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశం అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన, ఉద్యోగుల పంపిణీపై ఆయన చర్చిస్తున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలు ఖరారు చేయనుంది. అలాగే ప్రత్యూష్ సిన్హా కమిటీతో కూడా మహంతి భేటీ కానున్నారు.

ఐఏఎస్ల ఆప్షన్లపై గత కొంతకాలంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు కమలనాథన్ కమిటీ, ప్రత్యూష్ సిన్హా కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో  సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఎక్కడివారిని అక్కడనే నియమిస్తే మంచిదన్న అభిప్రాయంలో సీఎస్, ప్రత్యూష్ సిన్హా కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది.