ముగిసిన సార్వత్రిక సమరం


16న ఫలితాలు
ఎగ్జిట్‌ పోల్‌లో..ఎన్డీయే హవా
న్యూఢిల్లీ, మే12 (జనంసాక్షి):
దేశవ్యాప్తంగా 16వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పర్వం ముగిసింది. సుదీర్ఘంగా తొమ్మిది దశల్లో సాగిన ఈ లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలిం గ్‌లో భాగంగా సోమవారం మూడు రాష్టాల్ల్రో 41 నియోజకవర్గాలకు పోలింగ్‌ పూర్తయింది. తుది విడతలో 60శాతం వరకు పోలింగ్‌ నమో దయ్యిం ది. ఇందులో నరేంద్రమోడీ పోటీ చేస్తున్న వార ణాసి నియోజకవర్గం ఉండడం విశే షం. ఉత్తరప్ర దేశ్‌లోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో మే 13న రీపో లింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలి పారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించిన 11 పో లింగ్‌ కేంద్రాల్లో మంగళవారం రీపోలింగ్‌ నిర్వ హించనున్నారు. బదౌన్‌, ఫిరోజాబాద్‌ లోక్‌సభ స్థా నాల నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములా యం సింగ్‌ యాదవ్‌ మేనల్లుళ్లు అక్షయ్‌ యాదవ్‌, ధర్మేంద్ర యాదవ్‌లు
పోటీ చేస్తున్నారు. వారణాసిలో పోలింగ్‌ జరుగుతున్న సోమవారం రోజున అభ్యర్థులు ఎవరికి వారే విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆప్‌ కన్వీనర్‌ కేజీవ్రాల్‌ మీడియాతో మాట్లాడుతూ తాను తప్పకుండా విజయం సాధిస్తానన్నారు. భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి నుంచి ఓడిపోక తప్పదని, కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌తో అసలు పోటీనే లేదని కేజీవ్రాల్‌ అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. సోమవారం వారణాసిలో ఓటు వేయడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారణాసి ప్రజలు మోడీ, కేజీవ్రాల్‌ లాంటి బయటి వ్యక్తులను ఒప్పుకోరని, ఈ గడ్డలో పుట్టిన తనకే పట్టం కడతారని అజయ్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఇక అందరి దృష్టి మే 16న వెలువడనున్న ఫలితాలపై ఉంది. యువ భారత భవిష్యత్తుని ఈ ఫలితాలు నిర్దేశిస్తాయన్న ప్రచారం నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ప్రజల నిత్యజీవితంలో సైతం బహుళ చర్చనీయాంశం అయ్యాయి. చివరి దశ సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్టాల్ల్రోని 41 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్‌ ముగిసింది. 41 నియోజకవర్గాల్లో కలిపి సాయంత్రం 5 గంటల సమయానికి సగటున 60 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లలో చివరి విడతలో మొత్తం 606 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పశ్చిమబెంగాల్‌లో 77.41 శాతం, బీహార్‌లో 53.82 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 52 శాతం పోలింగ్‌ నమోదైంది. అరుణాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిన రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. రిగ్గింగ్‌ జరిగిన రిచిక్‌, చుల్లా పోలింగ్‌ కేంద్రాల్లో మే 14న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు ముఖ్య ఎన్నికల అధికారి చంద్రభూషన్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవాలని భూషన్‌ ప్రజలకు సూచించారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్‌ 7న తొలి దశ పోలింగ్‌ జరగగా, మే 12న చివరిదశ పోలింగ్‌ జరిగింది. ప్రస్తుతం దేశంలో 81.4 కోట్ల మంది అర్హత పొందిన ఓటర్లు ఉన్నారు. అందుకే ఇది చరిత్రలో అతి పెద్ద ఎన్నికగా పేరొందింది. ఎన్నికల కంటే ముందే కాబోయే ప్రధాన మంత్రి గురించి విశేష చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్‌ మాత్రం రాహుల్‌ను అధికారికంగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేకపోయింది.
అయితే మోడీని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన లెక్కకు మిక్కిలి సభల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. మార్పు, అవినీతి ఈ రెండు అంశాలు ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు అత్యధికంగా ప్రయోగించాయి. కాంగ్రెస్‌ అవినీతి, పదేళ్లలో కుంభకోణాలు ప్రచారంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. నోటా (పై ఎవరికీ కాదు) తొలిసారిగా ప్రవేశపెట్టింది ఈ ఎన్నికల్లోనే. ఈ ఎన్నికల్లో అత్యధికంగా వార్తల్లో చోటుచేసుకున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి. ఇక్కడ భాజపా ప్రధాని అభ్యర్థి మోడీ, ఆప్‌ కన్వీనర్‌ కేజీవ్రాల్‌, కాంగ్రెస్‌ తరఫున అజయ్‌రాయ్‌ పోటీ పడుతున్నారు. చివరకు ఇక్కడ మోడీ ర్యాలీకి ఈసీ అనుమతి నిరాకరించింది. దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. కాగా న్యూస్‌ ఎక్స్‌ప్రెస్‌ సీ ఓటర్‌ జరిపిన సర్వేలో ఎన్డీయేకు 289, యూపీఏకు 101, ఇతరులు 153 స్థానాల్లో గెలుస్తారని తేల్చింది.