కొత్త ఆర్మీ చీఫ్‌గా దల్బీర్‌సింగ్
న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) :
కొత్త ఆర్మీ చీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్‌ను ప్రభుత్వం నియమించింది. మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో భేటీ అయిన కెబినెట్ నియామకాల కమిటీ ఈమేరకు రక్షిణ మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సును ఆమోదించింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్తగా వచ్చే ప్రభుత్వం ఆర్మీ చీఫ్‌ను నియమించే అవకాశం ఉన్నా యూపీఏ సర్కారు ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందంటూ బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. అయినా మన్మోహన్ సర్కారు దల్బీర్‌సింగ్ నియామకాన్ని ఖరారు చేసింది. 59 ఏళ్ల లెఫ్ట్‌నెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న లెఫ్ట్‌నెంట్ జనరల్స్‌లో ఆయన సీనియర్. ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ జులై 31న పదవీ విరమణ చేస్తారు. అనంతరం సుహాగ్ ఆయన స్థానంలో బాధ్యతలు చేపడతారు. సుహార్ ఆర్మీ చీఫ్‌గా 30 నెలల పాటు పదవిలో కొనసాగుతారు.