సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం : భన్వర్‌లాల్
ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 78 ప్రాంతాల్లో 168 కౌంటింగ్ కేంద్రాలు, 437 హాళ్లలో 6,955 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 25 వేల సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నారని ఆయన తెలిపారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ను ఏర్పాటు చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు.
గురువారం అర్థ రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కేంద్రాల సమీపంలో మద్యం షాపులు బంద్ చేయాలని భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని నియోజక వర్గాల్లో ఎక్కువ రౌండ్లు జరుగుతాయని, కూకట్‌పల్లి పెద్ద అసెంబ్లీ నియోజక వర్గమని 45 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని, చార్మినార్ 13 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని, మల్కాజ్‌గిరి లోక్‌సబ స్థానానికి 45 రౌండ్ల కౌంటింగ్ ఉంటుదని ఆయన తెలిపారు.
ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. మొదటగా పోస్టల్ బ్యాలట్ పేపర్లు కౌంటింగ్ చేస్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.