గవ్వే పాత ముచ్చట్లు ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర చేసా


హైదరాబాద్‌, మే 17 (జనంసాక్షి) :తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధి నేత చంద్రబాబు మళ్లీ అదే రీతిలో అక్కసు వెళ్లగక్కారు. విభజన హేతు బద్ధంగా జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రా ల అభివృద్ధి కోసం పని చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పునాదులు వేసి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దు తానని చెప్పారు. రాష్ట్ర విభజన హేతుబద్దంగా లేదని అందుకే ప్రజలు కాం గ్రెస్‌ను భూస్థాపితం చేశారని పేర్కొన్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో శనివార్తం

చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగువారి అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్‌ ఆనాడు టీడీపీని స్థాపించారన్నారు. అలాంటి పార్టీని కుట్ర పన్ని దెబ్బ కొట్టాలనుకున్న వారికి ప్రజలు గట్టి బుధ్ది చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, అందుకే కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఓడించారన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా తెలుగువారంతా ఒకటేనన్నారు. సీమాంధ్రతో పాటు, తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అధికారం ఉంది కదా అనే పేట్రేగిపోతే ఫలితం ఎలా ఉంటుందో ప్రజలు చూపించారన్నారు. తెలంగాణను సామాజిక తెలంగాణగా, బంగారు తెలంగాణగా, సీమాంధ్రను స్వర్ణాంధ్రగా తయారు చేసేందుకు ఎన్టీఆర్‌ ఆశీస్సుల కోసం ఆయన ఘాట్‌కు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు.సీమాంధ్రలో పునాది నుంచి అభివృద్ధిని ప్రారంభించాలి తెలంగాణను సామాజిక తెలంగాణగా, బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి పునాదులు వేసి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానన్నారు. తెలుగు జాతితో కాంగ్రెస్‌ పార్టీ ఆటలాడిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా లేనందునే ప్రజలు కాంగ్రెస్ను భూస్థాపితం చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. దేశంలోనే తెలుగు జాతి గొప్పగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.