విభజన పనులు ఆలస్యం వద్దు
సమీక్షించిన గవర్నర్
హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) :
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి తెలంగాణ, సీమాంధ్రలో ప్రభు త్వాలు ఏర్పడబోతున్న తరుణంలో విభజన పనుల్లో ఆల స్యం వద్దంటూ గవర్నర్ నరసింహన్ అధికారులను ఆదేశిం చారు. ఆదివారం ఆయన రాజ్‌భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ అ హ్మద్, ఏఎన్ రాయ్‌తో పాటు 21 విభజన కమిటీల అధికా రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 2 అపాయింటెడ్ డే దగ్గర పడుతున్న నేపథ్యంలో నిర్వహించిన సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరిం చుకుంది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల
ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నందున ఆయా కమిటీలు వాటికి అప్పగించిన పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలని గవర్నర్ ఆదేశించారు. జూన్ రెండో తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పంపకాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ రెండో తేదీ నుంచి నాలుగు నెలల పాటు రెండు రాష్ట్రాల ఖర్చులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.35,595 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.25,516 కోట్లు కేటాయించారు. విభజన చట్టం పదో షెడ్యూల్‌లోని 107 విద్యాసంస్థలకు అదనంగా మరో 38 చేర్చాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. కృష్ణా, గోదావరిపై నిర్మిస్తున్న 16 ప్రాజెక్టులను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ నివాసాల విభజన మార్గదర్శకాలు ఆమోదించారు. ఉద్యోగుల పంపిణీ కోసం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, హోం, ఆర్థిక, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా కమలనాథన్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేయనున్నారు.