మోదీ ప్రమాణ స్వీకారానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ , మన్‌మోహన్

న్యూ ఢిల్లీ, మే 26: భారత 15 వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ విచ్చేశారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కూడా విచ్చేశారు. ఆలాగే ప్రధాని డాక్టర్ మన్‌మోహన్ సింగ్ సతీసమేతంగా సభాస్థలికి చేరుకున్నారు.
భద్రతా సిబ్బంది ముందు వరుసలో కేటాయించిన సీట్లలో వీరిని కూర్చోబెట్టారు. అనంతరం విదేశీ దేశాధ్యక్షులు విచ్చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాలనుంచి విచ్చేసిన ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. వారిని వెనుకవరుసలలో కూర్చోబెట్టారు. అలాగే మన్‌మోహన్ కేబినె ట్‌లో పనిచేసిన పెక్కుమంది మంత్రులు వెనుకవరుసలలో కూర్చుని కనిపించారు.