సాయంత్రం మోడీ తొలి కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5గం.లకు కేబినెట్‌తో తొలి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మోడీ కేబినెట్ మంత్రులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. మంత్రులు ఆడంబరాలు వీడి మిషన్‌మోడ్‌లో పనిచేయాలని ఆయన మంత్రులకు సూచించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి . అదేవిధంగా ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయంతోపాటు వివాదాస్పద ముంపు గ్రామాల విషయంలో కేంద్రమంత్రి వర్గం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.