ప్రతికూలతల మధ్య గాలింపు
మరో రెండు మృతదేహాలు లభ్యం
సిమ్లా, జూన్ 12 (జనంసాక్షి) :
బియాస్ నదిలో గల్లంతైన విద్యా ర్థుల కోసం ప్రతికూల పరిస్థితుల్లో నూ గాలింపు కొనసాగుతోంది. వరద ఉద్ధృతి, ప్రతికూల వాతావరణం మధ్య సెర్చ్ ఆపరేషన్ ఆగుతూ.. సా గుతోంది. తల్లిదండ్రుల ఒత్తిడి మేర కు గురువారం నుంచి గాలింపు మ రింత ముమ్మరమైంది. ఉదయం నుంచే గజ ఈతగాళ్లు, సహాయక స ిబ్బంది బియాస్ నదిని జల్లెడ పటా ్టరు. గల్లంతైన విద్యార్థుల కోసం నావి కాదళానికి చెందిన గత ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. గురువారం మరో రెండు
మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 16 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అదనపు సిబ్బందితో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రత్యేక కెమెరాలను వినియోగిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి గాలింపు చర్యలను సవిూక్షిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 20 మంది గజ ఈతగాళ్లతో పాటు సైన్యానికి చెందిన మరో 18 మంది గజ ఈతగాళ్లు నదీ అడుగు భాగాన వెతుకుతున్నారు. 84 మంది ఎన్డీఆర్‌ఎప్ సిబ్బంది, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, 550 పారామిలిటరీ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే, బురద కారణంగా వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న నీటిలోనూ గాలింపు చేపడుతున్నారు.
రెండు మృతదేహాల వెలికితీత
గురువారం రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలతో మృతి చెందిన ఆ విద్యార్థిని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఉపేందర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని చూసి కన్నవారు అక్కడే కుప్పకూలిపోయారు. విహార యాత్రకు వెళ్లిన తమ కుమారుడు చివరికి విగత జీవిగా మారటంతో గుండెలవిసేలా రోదించారు. అనంతరం మృతదేహాన్ని మండీకి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో మరో మృతదేహాన్ని వెలికితీశారు. అతడ్ని హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌గా గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన అనంతరం హైదరాబాద్‌కు తరలించనున్నట్లు ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.
మానవ రహిత విమానంతో గాలింపు..
సహాయక సిబ్బంది చేరుకొని ప్రాంతాలకు ఏరియల్ వెహికిల్‌తో గాలింపు చేపడుతున్నట్లు జాతీయ విపత్తుల నివారణ సంస్థ డిప్యూటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పాండూ డ్యాం వద్ద ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా మృతదేహాలను వెలికితీసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఈతగాళ్లతో గాలింపు చేపట్టామని చెప్పారు. వీలైనంత త్వరగా సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని వివరించారు. సిబ్బంది కొరత లేదని, అదనపు సిబ్బందిని రప్పిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, మానవ రహిత విమానంతో గాలింపు చేపడతామన్నారు. విద్యార్థుల మృతదేహాలను తొందరగా వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నామని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. సహాయ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు.
తల్లిదండ్రుల ఆగ్రహం
మృతదేహాల వెలికతీత ఆలస్యం కావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించక ఆందోళన చెందుతున్న కన్న వారు.. ఆగుతూ సాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌తో మరింత ఆవేదనకు గురవుతున్నారు. కనీసం తమ వాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటన స్థలానికి వచ్చిన మర్రి శశిధ ర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. మృతదేహాల వెలికతీత ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు మరింత విస్తృతం చేయాల ని డిమాండ్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వారు నచ్చజెప్పారు.
ప్రత్యేక కెమెరాలతో గాలింపు..
20 కిలోవిూటర్ల మేర బియాస్ నదిని జల్లెడ పడుతున్నామని కానీ, ప్రవాహ ఉద్ధృతి, బండరాళ్లు, బురద వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎన్డీఆర్‌ఎఫ్ కమాండింగ్ ఆఫీసర్ జైదీప్‌సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కెమెరాలతో గాలింపు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రమాదం జరిగిన తాలోట్ నుంచి పాండో డ్యామ్ వరకు గల 20 కిలోవిూటర్ల దూరంలో సెర్చ్ ఆపరేషన్ కొనసా గుతోంది. అయితే, నదీ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం, బండరాళ్లు, బురద ఎక్కువ ఉండడం ఆటం కంగా మారింది. మృతదేహాలు బురదలో కూరుకుపోయి ఉండాలి లేదా రాళ్ల మధ్య చిక్కుకొని ఉండా లి. వాటిని వెలికితీసేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని’ చెప్పారు.
హైదరాబాద్ చేరుకున్న షబ్బీర్ హుస్సేన్ మృతదేహం
హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన షబ్బీర్ హుస్సేన్(20) మృతదేహాన్ని గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడినుంచి కుటుంబసభ్యులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో నగరంలోని శేరిలింగంపల్లి తీసుకెళ్లారు. బంధువులు,స్నేహితులు శవాన్ని చూసి తట్టుకోలేక భోరున విలపించారు. బుధవారమే మృతదేహం రావాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణం కారణంగా తీసుకుని రాలేకపోయారు. ఇదిలావుంటే హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గురువారం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బియాస్ నదిలో లార్జి డ్యామ్‌కు దిగువున వీటిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఇందులో ఒకటి ఖమ్మం జిల్లాకు చెందిన టి.ఉపేందర్, మరొకటి హైదరాబాద్‌కు చెందిన అరవింద్ మృతదేహంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెండు మృతదేహాలను మండి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు వెలికి తీసిన మృతదేహాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మరోవైపు లార్జి డ్యామ్ గేట్లను మూసివేసి నీటి విడుదలను నిలిపివేశారు. నిన్న మధ్యాహ్నం భారీగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున నీరు చేరుకుని బియాస్ నదిలో నీటి మట్టం పెరగడంతో దిగువున ఉన్న పండూ డ్యామ్ నుంచి ఒక గేటును ఎత్తివేసి నీటిని వదులు తున్నారు. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు ఐటీబీపీ, సైన్యానికి చెందిన బృందాలు తీవ్రస్థాయిలో ఇవాళ గాలింపుచర్యలు చేపట్టాయి. లార్జి డ్యామ్ నుంచి పండూ డ్యామ్ వరకు బోట్ల సాయంతో గాలింపు చర్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అటు కాలినకడన కూడా కొన్ని బృందాలు గల్లంతినవారి ఆచూకీ కోసం వెతుకుతున్నాయి.
ఐదోరోజు కొనసాగుతున్న గాలింపు : మర్రి శశిధర్‌రెడ్డి
బియాస్‌నదిలో గల్లంతైన విద్యార్దుల కోసం ఐదోరోజు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగు తున్నాయని ఎన్డీఎంఏ వైఎస్ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. సహాయక సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో ఏరియల్ వెహికల్‌తో గాలింపు చేపట్టనున్నట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర శశిధర్‌రెడ్డి గురువారమిక్కడ తెలిపారు. సహాయక చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ అయిదో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. జాతీయ సముద్ర పరిశోధనా సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని, సిబ్బంది వెళ్లలేని ప్రదేశాల్లో ఏరియల్ వెహికల్ గాలింపు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. శబ్ద తరంగాలతో నీటిలో ఉన్న మృతదేహాలను కనిపెడుతుందని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల మృతదేహాల కోసం ఇంకా సమయం పడుతోందని ఆయన అన్నారు. కాగా ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. గల్లంతు అయిన మరో 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మృతదేహాలను తొందరగా వెలికితీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సహాయ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని నర్సింహారెడ్డి వివరించారు.