భూటాన్‌, నేపాల్‌ మీదుగా హిమాలయ క్రీడా వేదిక

two
భూటాన్‌ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ/థింపు, మే 16 (జనంసాక్షి) :భూటాన్‌, నేపాల్‌ మీదుగా హిమాలయ క్రీడా వేదిక ఏర్పాటు చేస్తామని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్‌లో స్థిర త్వం, అభివృద్ధి ఇరుగుపొరుగు దేశాలకు మేలు చేస్తుందని మోడీ అన్నారు. పొరుగు దేశాలతో భారత్‌ ఎప్పుడూ సత్సంబంధాలు కోరకుంటుందని చెప్పారు. భూటాన్‌తో భారత్‌ సత్సంబంధాలు కొనసాగుతాయని ప్రకటించారు. భారత్‌ , భూటాన్‌ మధ్య సాంస్కృతిక బంధాలు ఉన్నాయన్న మోడీ.. భారత్‌లో ప్రభుత్వాలు మారినా భూటాన్‌తో సత్సంబంధాలు కొనసాగాయి తెలిపారు. భూటాన్‌లో
పర్యటిస్తున్న మోడీ సోమవారం ఆ దేశ పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. భూటాన్‌ తమకు సన్నిహిత దేశమని, ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించడం గౌరవంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు రాజ్యాంగబద్ధమైనవే కాకుండా సాంస్కృతికమైనవని చెప్పారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా భూటాన్‌తో సత్సంబంధాలు కొనసాగాయని.. మున్ముందు కూడా ఇది కొనసాగుతుందని హామీ ఇచ్చారు. భారత్‌ అభివృద్ధి చెందితే ఆ ప్రభావం పొరుగు దేశాల మీద ఉంటుందని.. ఆయా దేశాలు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ”భారత్‌లో స్థిరత్వం, అభివృద్ధి భూటాన్‌ లాంటి పొరుగు దేశాలకు మేలు కలుగుతుందన్ణి వ్యాఖ్యానించారు. సామాన్యుల హక్కుల కోసం భూటాన్‌ రాజ కుటుంబం తీసుకన్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. భూటాన్‌ ఏడేళ్ల కాలంలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యంలో మారడం దేశంలో ప్రభుత్వ పనితీరును వెల్లడస్తోందని అభినందించారు. బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పొరుగు దేశాలకు సాయం చేయగలమని మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షికం సబంధాలను కాపాడుకుంటూ.. మరింత బలపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉగ్రవాదం విడదీస్తే పర్యాటకం కలుపుతుందని వ్యాఖ్యానించారు. భూటాన్‌లో టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు భారీగా పెట్టుబడులు అవసరం లేదని దాని ద్వారా లభించే ఫలాలు పేదలకు కూడా చెందాలని అభిప్రాయపడ్డారు. ఓమాలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్న మోడీ.. హిమాలయాల పర్వత పరిశోధనలకు గాను ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. రాబోయే దశకంలో ఇంధన భద్రత కీలకమైనదని చెప్పారు. విద్య కోసం భూటాన్‌ బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత తరాలకే కాదు.. భవిష్యత్‌ తరాల కోసం భూటాన్‌ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. భూటాన్‌లో ఇ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని మోడీ చెప్పారు. ఇటీవల తన ప్రమాణ స్వీకారానికి హాజరైన భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ తోబ్గేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌-భూటాన్‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 600 మెగావాట్ల కొలంగ్చూ హైడ్రో-ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఉభయసభలను ఉద్దేశించిన అనంతరం మోడీ ఆ ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.