ఆధునిక పోలీసింగ్
న్యూయార్క్ తరహాలో మన పోలీస్
పటిష్ట వ్యవస్థకు ముఖ్యమంత్రి నిర్ణయం
హైదరాబాద్, జూన్ 21 (జనంసాక్షి) :
బ్రాండ్ హైదరాబాద్‌కు తగ్గట్లుగా పటిష్టమైన ఆధునిక పోలీ స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చం ద్రశేఖర్‌రావు తెలిపారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరా బాద్, సైబరాబాద్ కమిషనర్లతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ మేరకు శనివారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీ ఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరా బాద్ పరిధిలో న్యూయార్క్ తరహా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలీసులకు
యూనిఫాంను మార్చాలని కూడా నిర్ణయించారు. త్వరలో 1,650 ఇన్నోవాలు, 1,600 ద్విచక్రవాహనాలు కోనుగోలు చేయాలని, అంతర్జాతీయ స్థాయి నిఘా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పనితీరును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై నిర్వహించిన సవిూక్ష సమావేశంలో ‘అధునాతన టెక్నాలజీని వాడుతూ న్యూయార్క్ తరహా పోలీసింగ్‌ను నిర్వహించాలి’ అని కేసీఆర్ తెలిపారు. సమావేశానికి ¬ం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీస్ సిబ్బంది డ్రెస్ కోడ్‌ను పూర్తిగా మార్చాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ జంటనగరాలు అంతా కవరయ్యేలా సీసీ కెమరాలు తక్షణం అమర్చండని కేసీఆర్ అధికారులకు తెలిపినట్టు సమాచారం. తరవాత నాయిని మాట్టాడుతూ హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో పటిష్టం చేయనున్నట్లు ¬ంమంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. న్యూయార్క్ తరహా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రేటర్ పరిధిలోని పోలీస్ యూనిఫామ్ మార్చనున్నట్లు వెల్లడించారు. పోలీస్ వ్యవస్థలో ఒకే రకమైన కంట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. దీనికోసం రూ.300 కోట్లతో 1,650 ఇన్నోవాలు, 1,600 బైకులు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రెస్‌కోడ్‌ను బ్లూ కలర్‌కుమార్చే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేలా పోలీస్ కమిషనరేట్లను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీస్ వ్యవస్థ ఆధునీకీకరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో నూతన వాహనాలు కొనుగోలు చేస్తామని, పోలీసులకు సంబంధించిన ట్యాక్సీలు, క్యాబ్‌లు అన్నీ ఒకే రంగులో ఉండాలని నిర్ణయించామన్నారు. గల్లీ గస్తీ పేరుతో మోటారు బైకు పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసుల యూనిఫాం మార్చాలని ఈ సమావేశం నిర్ణయించామని, గ్రేటర్ పరిధిలోని పోలీసులకు ఐరాస భద్రతాదళాల తరహాలో లైట్ బ్లూ కలర్ చొక్కా, డార్క్ బ్లూ కలర్ ప్యాంటుతో కొత్త యూనిఫాం అందిస్తామన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నాయిని వెల్లడించారు. అదే విధంగా పోలీస్‌శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వివరించారు. పోలీసులు తప్పు చేసినా గుర్తించేలా వ్యవస్థను రూపొందిస్తామన్నారు. నేరం జరిగిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి పోలీసులు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు.