తెలంగాణ కోసం సర్వశక్తులూ ఒడ్డుతాం

naina
ఎమ్మెల్సీగా నాయిని ప్రమాణం
అభినందించిన డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ
హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :
తెలంగాణ పునర్నిర్మాణం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యుడిగా నామినేట్‌ అయి న ఆదివారం ప్రమాణం చేశారు. ఆయనతో శానసమండలి చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రమాణం చేయించారు. అలాగే మరో స భ్యుడు రాములునాయక్‌ కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నాయిని నర్సిం హారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం 2001 నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్నా మని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాను 1969 నుంచి పోరాడుతున్నానని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ అనే పదం ఉచ్చ రించవద్దన్నప్పుడు, విషేధించినప్పుడు కేసీఆ ర్‌ పదవులను వదులుకొని తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. తాను ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీని కాకున్నా కేసీ ఆర్‌ తనకు హోం మంత్రి పదవి ఇచ్చి నిబద్దతతో
ఉద్యమంలో పాల్గొన్న వారిని గౌరవించారని అన్నారు. రాములు నాయక్‌ మాట్లాడుతూ, తాను పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నానని, మొదటి అవకాశంలోనే గిరిజనుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ రాముడైతే తాను హనుమంతుడిలా వెంటే ఉంటానని అన్నారు. వీరిని డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అభినందించారు.