పీవీ తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ
ఆయన పేర యూనివర్సిటీ, జిల్లా
హైదరాబాద్‌లో భారీ విగ్రహం
భారతరత్న ఇవ్వాలి : సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 28 (జనంసాక్షి) :
తెలంగాణ జాతి ఖ్యాతి పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన తెలంగాణ ఠీవీ అన్నారు. అలాంటి పివికి ఎన్ని భారతరత్నలు ఇచ్చినా తక్కువేనన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన శనివారం పీవీ ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. పీవీ జయంతి వేడుకలను తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ‘పీవీ మా తెలంగాణ బిడ్డ…తెలంగాణ ఠీవీ’… ఆయన విగ్రహం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తే గుంపులో గోవింద అవుతుంది. అలా కాకుండా సమున్నత స్థానంలో ఘనంగా పీవీ విగ్రహ ప్రతిష్ట చేస్తాం. దేశం గర్వించేలా ఆ కార్యక్రమం చేపడతాం. పీవీని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదన్నారు. పివి జ్ఞాపకంగా అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రపంచం గర్వించదగ్గ బిడ్డ పీవీ అన్నారు. హైదరాబాద్‌లో త్వరలో పీవీ మెమోరియల్ భవన్ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలో ఒక జిల్లాకు, నూతనంగా ఏర్పాటు చేయనున్న ఓ యూనివర్సీటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టనున్నట్లు చెప్పారు. తెలుగుజాతి ఖ్యాతి పీవీ అని కొనియాడారు. దేశంలో తొలిసారి భూసంస్కరణల చట్టాన్ని తెచ్చిన ఘనత పీవీదేనన్నారు. భూసంస్కరణల కారణంగా ఆయన పదవీచ్యుతులయ్యారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుంచి పీవీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల్లో ఓ జిల్లాకు పీవీ పేరు పెడతాం. దాంతో పాటు జిల్లాలో స్థాపించబోయే యూనివర్సిటీల్లో ఓదానికి పీవీ పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తాం. పీవీ గౌరవానికి తగినట్లుగా స్మారక భవనం ఏర్పాటు చేస్తాం. ఢిల్లీలో ఆయనకు తగిన గౌరవం లభించలేదన్నారు. పివి మరణించినప్పుడు తాను ఢిల్లీలోనే ఉన్నానని తనను ఆయన మరణం ఎంతగానో కలచి వేసిందన్నారు. పీవీ రచనలు, సాహిత్యంలో గొప్ప అనుబంధం ఉందన్నారు. పీవీ మరణం నన్ను ఎంతో కలిచివేసిందని గుర్తు చేసుకున్నారు. పీవీ 17 భాషల్లో నిష్ణాతులు, ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా పీవీ వ్యక్తిత్వానికి తక్కువేనన్నారు. ఆచరణలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత పీవీకే దక్కుతుందని తెలిపారు. భూసంస్కరణల చట్టాన్ని తొలిసారిగా అమలులోకి తీసుకొచ్చినారని గుర్తు చేశారు. ఆచరణలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. పీవీకి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రాన్నికోరతాం. ఆయన ఆదర్శాలు, సంస్కరణలు, రచనలు భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు చేపడతాం’ అన్నారు. త్వరలోనే భారతరత్న ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. పీవీ తాను నమ్మినదాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఆయనకు ఎన్ని భారతరత్నలు ఇచ్చినా తక్కువేనని కొనియాడారు. పీవీ నరసింహరావు 93 జయంతి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. దేశ ప్రజలకు పీవీ ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. అమెరికా సెనెట్‌లో పీవీ చేసిన ప్రసంగం అనిర్వచనీయమన్నారు. పీవీ ఎప్పుడు కలిసినా… బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన నిర్ణయం తీసుకోకపోవడమే నిర్ణయమనే వారన్నారు. పీవీ ఆదర్శాలు నిరంతరం ఉండాలని, త్వరలో పీవీ పేరిట భవన్ నిర్మిస్తామని, అందులో పీవీ జ్ఞాపకాలు పదిలపరుస్తామని తెలిపారు. పీవీ విగ్రహం పెట్టాలనే ఆలోచన గత ప్రభుత్వానికి రాకపోవడం శోచనీయమన్నారు.
బహుభాషా కోవిదుడు, సంస్కరణలకు ఆద్యుడు దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారంతో సత్కరించాలని మంత్రి మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. రాజకీయ కారణాల వల్ల పీవీకి తగిన గౌరవం లభించలేదన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవం కల్పిస్తుందన్నారు. హైదరాబాద్‌లో త్వరలో పీవీ మెమోరియల్ భవన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ప్రతి ఏటా వైభవంగా పీవీ జయంత్యుత్సవాలు నిర్వహిస్తామన్నారు. శనివారం మాజీ ప్రధాని పీవీ 93వ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ స్మారక స్థలం జ్ఞానభూమి వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పీవీ సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలుగు జాతి ఖ్యాతి పీవీ నరసింహరావు అని కొనియాడారు. పీవీ మా తెలంగాణ బిడ్డ తెలంగాణ ఖ్యాతి అని అన్నారు. 17 భాషల్లో నిష్ణాతులైన పీవీ తెచ్చిన విప్లవాత్మక మార్పులు దేశ గమనాన్నే మార్చివేశాయని కొనియాడారు. భూసంస్కరణల చట్టాన్ని దేశంలోనే తొలిసారిగా అమలులోకి తెచ్చిన ఘనత ఆయన సొంతమన్నారు. భూ సంస్కరణలు అమలు చేయడం వల్లే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.
సరైన గౌరవం లభించలేదు
నరసింహారావుతో తనకు సాన్నిహిత్యం లేకున్నా సాహిత్యపరంగా తనకు పరిచయం ఉందని కేసీఆర్ చెప్పారు. పీవీ రచనలు, సాహిత్యంతో గొప్ప అనుబంధం ఉందన్నారు. పీవీ మరణం తనను ఎంతో కలచివేసిందని ఆయన మరణించిన సమయంలో తాను ఢిల్లీలోనే ఉన్నానని చెప్పారు. ఆయన మరణం, అనంతరం జరిగిన పరిణామాలు చూసి తాను కూడా బాధ పడ్డానన్నారు. దేశానికి కొత్త మార్గదర్శనం చూపిన పీవీకి సరైన గుర్తింపు లభించలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధానులందరికీ ఢిల్లీలో అంత్యక్రియలు, స్మారక స్థూపాలు ఉన్నాయని, ఒక్క పీవీకి మాత్రమే లేవని గుర్తు చేశారు. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్నారు.తెలంగాణ బిడ్డ అయిన పీవీని తమ ప్రభుత్వం సమున్నత రీతిలో గౌరవిస్తుందని చెప్పారు. పీవీని భారతరత్నతో సన్మానించాలని మంత్రిమండలిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. పీవీ తాను నమ్మిన దాన్ని ఆచరణలో చేసి చూపించారని ఆయనకు ఎన్ని అవార్డులు, భారతరత్నలు ఇచ్చినా తక్కువేనని కొనియాడారు. కొత్తగా ఏర్పడబోయే జిల్లాల్లో ఒక జిల్లాకు, అలాగే, నూతనంగా ఏర్పాటు చేయనున్న ఓ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధానికి సముచిత రీతిలో గౌరవం లభించేలా, ఆయన ఆదర్శాలు నిరంతరం ఉండాలని హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ భవన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తే గుంపులో గోవిందలా అవుతుందని.. అలా కాకుండా సమున్నత స్థానంలో ఘనంగా పీవీ విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామన్నారు. దేశం గర్వించేలా ఆ కార్యక్రమం చేపడతామని చెప్పారు. తాను ఏమన్న అంటే వివాదం చేస్తారని.. తెలుగు జాతికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మ¬న్నత వ్యక్తి అయిన పీవీ నరసింహరావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం దారుణమన్నారు. ఢిల్లీలో సముచిత గౌరవం కల్పించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. ఆయన ఆదర్శాలు, సంస్కరణలు, రచనలు భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం చేస్తున్న జయంత్యుత్సవాలు నామమాత్రమేనని వచ్చే సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
భారత రాజకీయల్లో వేగుచుక్క
భారత రాజకీయ చరిత్రలో వేగుచుక్క పీవీ నరసింహరావు అని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. దేశ ప్రజలకు ఆయన ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. దేశ ఆర్తిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి అని.. ఆర్థిక సంస్కరణల్లో ఆయనది అందెవేసిన చేయి అని ప్రశంసించారు. భారత రాజకీయ చిత్రపటంలో పీవీ వంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే పదవి నుంచి ప్రధాని వరకు అన్ని పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. ప్రపంచ చరిత్రను ఔపోసన పట్టిన వ్యక్తి ఆయన అని అన్నారు. పీవీ నిర్ణయాలు తీసుకోరన్న అపవాదు సరికాదు నిర్ణయం తీసుకోకపోవడం అంటే అదే నా నిర్నయం అని ఆయన చెప్పే వారన్నారు. అమెరికా సెనెట్‌లో ఆయన చేసిన ప్రసంగం అనిర్వచనీయమన్నారు. పీవీని ఎప్పుడు కలిసినా బాగున్నారా? అంటూ ఆప్యాయంగా పలకరించే వారని గుర్తు చేసుకున్నారు. పీవీ స్ఫూర్తిగా జ్ఞానభూమిని ఆయుర్వేద మొక్కల కేంద్రంగా మార్చాలని అధికారులకు సూచించారు.
తెలంగాణకే గర్వకారణం
దివంగత ప్రధాని నరసింహరావు తెలంగాణ ప్రాంతానికే గర్వకారణమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి అన్నారు. పీవీ జయంతిని ప్రభుత్వం అధికారింకగా నిర్వహించడం అభినందనీయమన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ధీశాలి పీవీ అని పేర్కొన్నారు. దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. దేశానికి ఎనలేని సేవ చేసిన తెలుగు బిడ్డ పీవీకి సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు మాజీ ప్రధానికి ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. రాజకీయ కారణాల వల్ల ఆయనకు తగిన గుర్తింపు లభించకపోయినా ఆయన చేసిన సేవలు, చేపట్టిన సంస్కరణలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయన్నారు.
పీవీ 17 భాషల్లో నిష్ణాతులు, ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా పీవీ వ్యక్తిత్వానికి తక్కువేనన్నారు. ఆచరణలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత పీవీకే దక్కుతుందని తెలిపారు.దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ ప్రాంతానికే గర్వకారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి అన్నారు. పీవీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పీవీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయం. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశాభివద్ధి కోసం అహర్నిహలు కషి చేసిన ధీశాలి పీవీ అని ఆయన పేర్కొన్నారు.రాజనీతివేత్త పీవీని గత ప్రభుత్వాలు విస్మరించాయని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సినారె అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పీవీ 93వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 1950 నుంచి పీవీతో నాకు పరిచయం ఉంది. పీవీ బహుభాషా కోవిదుడు. 17 భాషాల్లో పీవీకి ప్రావీణ్యం. పండితులకే ఒకపట్టాన అర్థమయ్యేందుకు కష్టంగా ఉన్నా వేయి పడగలు నవలను సహస్త్ర ఫణ్ పేరుతో హిందీలోకి అనువదించిన ఘనుడు పీవీ. పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి, సాహితీవేత్త సినారె, ఎంపీలు బండారు దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, కె.కేశవరావు, కవిత, పీవీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక సలహాదారు రమణాచారి తదితరులు సమన్వయం చేశారు.