రాహుల్ వేస్ట్.. అబ్బే… నేను అలా అలేదు : దిగ్విజయ్

 

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సంచలన విమర్శలు చేశారు. రాహుల్‌కు నాయకత్వ పటిమ లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో ఆయన తన మాటలను ఉపసంహరించుకోవడమే కాకుండా, వివరణ కూడా ఇచ్చుకున్నారు. 
రెండు రోజుల పర్యటనకు శుక్రవారం గోవాకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత బాధ్యతను ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ..’రాహుల్ స్వతహసిద్ధంగా నాయకత్వ పటిమ ఉన్న వ్యక్తి కాదు. అయితే, ఆయనది న్యాయం కోసం పోరాడే నైజం’ అని దిగ్విజయ్ సమాధానమిచ్చారు. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నేత బాధ్యతను తీసుకోవాలని రాహుల్‌ని కోరామని, ఆయన ఆ బాధ్యతను తీసుకోవాల్సిందనీ అభిప్రాయపడ్డారు. 
అయితే, తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో అనంతరం ఆయన బెంగళూరులో వాటిపై వివరణ ఇచ్చారు. తాను రాహుల్‌కు నాయకత్వ పటిమ లేదని వ్యాఖ్యానించలేదని, అధికారం కన్నా న్యాయం కోసం పోరాడటానికే రాహుల్ ప్రాధాన్యమిస్తారని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాహుల్ నేతృత్వంలోనే ఉందన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓ టమికి ప్రభుత్వ పథకాలపై తాము సరైన రీతిలోప్రచారం చేయలేకపోవడమూ కారణమైందన్నారు.