అమర్‌నాథ్‌ యాత్రికులు ముగ్గురి మృతి

శ్రీనగర్‌: 44 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర శనివారం ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన రెండో రోజుకే ముగ్గురు యాత్రికులు మృతిచెందడం విచారకరం. పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు కొండచరియలు విరిగిపడి మృతిచెందగా మరొకరు అనారోగ్యంతో మృతిచెందినట్లు సమాచారం. మృతిచెందినవారిలో ఇద్దరిని సురేంద్రయాదవ్‌, తారాసింగ్‌లుగా గుర్తించారు. అమర్‌నాథ్‌ యాత్రకు శనివారం రెండు బృందాల్లో 152, 742 మంది యాత్రికులు ప్రయాణం ప్రారంభించగా, ఈరోజు ఉదయం 1,458 మందితో మూడో బృందం కూడా ప్రయాణమైంది.