ఎన్‌ కన్వెన్షన్‌కు నోటీసులు

2

కబ్జాయే అని తేల్చిన జీహెచ్‌ఎంసీ

త్వరలో కూల్చే అవకాశం

హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) :

సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమ నిర్మాణమేనని తేల్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడ గోడలపై రెడ్‌మార్క్‌ వేశారు. సోమవారం సాయంత్రం సెంటర్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. సెక్షన్‌ 452 ప్రకారం యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. యాజమాన్యం ఒకవేళ నోటీసులపై స్పందించకపోతే గోడలకు నోటీసులు అంటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో యాజమాన్యం స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి యోచిస్తోంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ తమ్మిడికుంటకు చెందిన మూడు ఎకరాల 12 కుంటల భూమిని కలుపుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 1 ఎకరం 12 కుంటలు ఎస్‌టిఎల్‌ పరిధిలోకి రాగా, రెండెకరాలు బవర్‌జోన్‌ కిందకు వస్తుంది. కాగా, ప్రభుత్వం నిర్ణయంపై న్యాయం పోరాటం చేయాలని యాజమాన్యం భావిస్తోంది. తాము ఘటకేసర్‌ గురుకుల సంస్థ నుంచి కొనుగోలు చేశామని, చట్టప్రకారం అన్ని దస్తవేజులు తమవద్ద ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది.