పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై సభలో గందరగోళం

3-30 గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ, జూలై 8 : పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించగా, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు బిల్లును స్వాగతించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని ఉప సభాపతి విజ్ఞప్తి చేసినా టీఆర్ఎస్ ఎంపీలు వినలేదు. సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడడంతో సభను 3-30 గంటలకు వాయిదా వేశారు.