హైదరాబాద్‌లో సీఎన్‌జీ కొరత

హైదరాబాద్ : హైదరాబాద్‌లో సీఎన్‌జీ కొరత ఏర్పడింది. గ్యాస్ పైప్ లైన్ల మరమ్మతుల కారణంగా రెండో రోజు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. సీఎన్‌జీ కొరతతో 100 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. 25 వేల ఆటోలు సీఎన్‌జీ బంకుల ఎదుట క్యూ కట్టాయి.