8మెడికల్ కళాశాలలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సీఎం కేసీఆర్*

 వనపర్తి టౌన్ : నవంబరు 15 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలన్న దృక్పథంతో సీఎం కేసీఆర్ నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కళాశాలలు ఆన్లైన్ ద్వారా మంగళవారం రోజు మధ్యాహ్న 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఒకేసారి 8 మెడికల్ కాలేజీలో విద్యాబోధన తరగతులను, ప్రారంభించినారు. తద్వారా సంగారెడ్డి,మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల,వనపర్తిజిల్లా, కొత్తగూడెం,నాగర్ కర్నూల్, రామగుండం,మెడికల్ కళాశాలలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎంబిబిఎస్ తొలి విద్యా సంవత్సరంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావడం, వైద్య,విద్య అధికారులకు చాలా సంతోష వ్యక్తపరుస్తూ కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేచేశారు.