తండ్రి చేతిలో ప్రాణాలుకోల్పయిన 8ఏళ్ల బాలిక
బెంగళూరు: ఎనిమిదేళ్ల చిన్నారిని పట్టుకుని సరిగా చదవడం లేదని ప్రాణం పోయేలాకొట్టాడో తండ్రి. కన్నతండ్రి చేతుల్లోనే బిడ్డ ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోగా ఇప్పుడా తండ్రి జైలులో వూచలు లెక్కబెడుతున్నాడు. పాప అతని మొదటి భార్య కుమార్తె అని, భార్య కూడా అతని వల్లే ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు చెప్తున్నారు. అప్పుడు సరైన సాక్ష్యం లేనందున అతడిని కోర్టు నిర్దోషిగా వదిలేసినట్లు సమాచారం. ఇప్పుడు మాత్రం బిడ్డ చావుకు తానే కారణమని ఒప్పుకొన్నాడా తండ్రి.