శ్రమ దోపిడీకి స్వస్తి

2

కనీస వేతనాల చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం : మంత్రి నాయిని

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) :

కార్మికుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని, కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ¬ం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలపై ఈ సందర్భంగా వారిని అడిగి తెలుసుకున్నారు. కనీస వేతన చట్టం, కంపెనీల్లో వసతులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతన చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. సంఘాలను ఏర్పాటు చేసుకోవడం కార్మికుల హక్కు అని పేర్కొన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును ఎవరైనా అడ్డుకొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల రోజుల్లో కార్మిక సంఘాల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 45 రోజుల్లో కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఆటోవాలాలపై పోలీసుల వేధింపులపై స్పందిస్తూ ఇక నుంచి అలాంటివి లేకుండా చూస్తామన్నారు. ఆటోలపై చలానా భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని కేంద్రం తీసుకుంటే నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిని రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.