తెలంగాణపై కేంద్రం కత్తులు
అధికారాల దురాక్రమణకు దొడ్డిదారిన కుట్ర
హైదరాబాద్‌పై ఆధిపత్యానికి ఎత్తులు
చట్టప్రకారమే గవర్నర్‌కు అధికారాలంటూ సన్నాయి నొక్కులు
మరో పోరాటానికి సన్నద్ధం కావాలని కేసీఆర్ పిలుపు
సీఎస్‌ల సమావేశంలో చర్చకురాని ‘అధికారాలు’
న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కత్తులు నూరుతోంది. దొడ్డిదారిన అధికారాలు కాజేయడానికి భారీ స్థాయిలో కుట్ర చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సీమాంధ్ర పెత్తందారుల స్క్రేన్‌ప్లే మేరకు కేంద్రం ఈ కుట్రలను రక్తి కట్టిస్తోంది. చట్టప్రకారమే ఉమ్మడి రాజధానిపై గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతున్నట్లు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరో పోరాటానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. అయితే గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మాత్రం గవర్నర్ అధికారాలపై ఎలాంటి చర్చ జరగలేదు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై సమావేశంలో పెద్దగా చర్చ జరగలేదు. గవర్నర్ అధికారాల అంశంపై చర్చ అనవసరమని అనిల్ గోస్వామి పేర్కొన్నారు. గవర్నర్ అధికారాలపై తాము ప్రస్తుతం ఇక్కడ చర్చించేది లేదని కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. విభజన చట్టంలో అన్నీ క్లియర్‌గా ఉన్నాయని తెలిపారు. విభజన చట్టంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆయా అంశాలను పరిశీలిస్తుందన్నారు. ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర ¬ం శాఖ కార్యదర్శితో విడిగా సమావేశమైన సందర్భంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. పది నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ అధికారాల పరిధిపై చట్టబద్ధంగా వ్యవహరిస్తామని గోస్వామి చెప్పినట్లు తెలిసింది. గవర్నర్‌కు విస్తృత అధికారాలు కల్పిస్తూ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా సెక్షన్ 8కి కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అయితే, తెలంగాణ ప్రభుత్వంలో 12 అంశాల బిజినెస్ రూల్స్‌పై ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాస్పద అంశాలపై కేంద్ర ¬ం శాఖ నిర్వహించిన సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో సభ్యులను కేటాయించాలని ¬ం శాఖ ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాల పరిధిపై చర్చించేందుకు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగానే గవర్నర్ అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాస్పద అంశాలపై ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీపీఏలు, కృష్ణా జలాల వినియోగం, విద్యుత్ కేటాయింపులపై చర్చ మాత్రమే జరిగింది. పీపీఏలు, కృష్ణా నదీ జల వివాదాలు, గవర్నర్ అధికార పరిధి తదితర అంశాలపై నిర్ణయాలు లేకుండానే సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పలు అంశాలపై వివాదం నెలకొంది. కృష్ణా నదీ జలాల విడుదల, విద్యుత్ పీపీఏల అంశం, ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాల బదలాయింపు, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్పు తదితర అంశాలపై వివాదం ముదిరిన నేపథ్యంలో కేంద్ర ¬ం శాఖ రంగంలోకి దిగింది. వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయానికి రెండు రాష్టాల్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గురువారం న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ¬ం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు చూస్తున్న అడిషనల్ కార్యదర్శి సురేశ్‌కుమార్, జల సంఘం అధికారులతో పాటు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలపై చర్చించారు.
పీపీఏలపై ఎవరి వాదన వారిదే..
విద్యుత్‌కు సంబంధించిన అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై రెండు రాష్ట్రాలు తమ వాదనకు కట్టుబడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న పీపీఏలను యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈఆర్‌సీ అనుమతి లేని పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. పీపీఏల ఆధారంగానే ఈఆర్సీ విద్యుత్ చార్జీలు నిర్ణయించిన నేపథ్యంలో వాటికి అనుమతి ఉన్నట్లేనని భావించాలని తెలిపింది. ఏపీలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తమకు కేటాయించిన విద్యుత్‌ను సరఫరా చేసేలా చూడాలని కోరింది. అయితే, పీపీఏల రద్దుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈఆర్‌సీ ఆమోదించని పీపీఏలను అనుమతించే ప్రసక్తే లేదని తెలిపింది. ఇరు రాష్ట్రాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయని ఈ నేపథ్యంలో తాము ఉత్పత్తిచేసే విద్యుత్‌ను తామే వినియోగించుకుంటామని పేర్కొంది. అనుమతి లేని పీపీఏలను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈఆర్సీ అనుమతి ఉన్నా పీపీఏల మేరకే విద్యుత్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కృష్ణా బోర్డుపై ఏకాభిప్రాయం
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బోర్డుపై మాత్రం సమావేశంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కృష్ణా నది నిర్వహణ బోర్డును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు కోరాయి. దీంతో పూర్తి స్థాయిలో కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బోర్డులో సభ్యులను కేటాయించాలని ¬ం శాఖ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. నదీ జలాల వివాదాలు, జలాల కేటాయింపుపై కృష్ణా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు ¬ం శాఖకు విజ్ఞప్తి చేశాయి. కృష్ణా జలాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ¬ం శాఖ దృష్టికి తీసుకువచ్చింది. తెలంగాణకు రావాల్సిన వాటాపై స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనిపై కేంద్ర జల సంఘం
నిర్ణయం తీసుకుంటుందని ¬ం శాఖ కార్యదర్శి తెలిపారు.