ముంబైలో ఐపీఎస్ అధికారిపై అత్యాచారం కేసు నమోదు

ముంబై, జులై 25 : ముంబై నగరంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిపై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం డీఐజీ హోదాలో ఉన్న సునీల్ పరాస్కర్ మీద నగరానికి చెందిన ఓ మోడల్ ఈ ఆరోపణలు చేసింది. గత ఏడాది అడిషనల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు సునీల్ తనపై పదే పదే అత్యాచారం చేశారని ఆ మోడల్ ఆరోపించింది.

ఒక సారి ఓ హోటల్‌కు తీసుకువెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మోడల్ వాపోయింది. ఈ మేరకు మల్వానీ పోలీస్ స్టేషన్‌లో ఆమె పిర్యాదు చేసింది. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా ఆదేశించారు. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మహిళా విభాగం ఈ కేసును దర్యాప్తు చేయనుంది.