850 గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ

కొమరోలు, జూలై 18 : కొమరోలు మండలంలోని పురుషోత్తంపల్లి గ్రామంలో బుధవారం 800 గొర్రెలకు, 50 మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి దుక్కి ఆంజనేయరెడ్డి, జెకెట్రస్ట్‌ శ్రీను, గోపాలమిత్ర రవి పాల్గొన్నారు. అదే విధంగా గురువారం 19వ తేది చింతలపల్లి పంచాయితీలోని కూరాకువానిపల్లి, గోహరపల్లి గ్రామాల్లో నట్టల నివారణ మందును తాగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ పంచాయితీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంజనేయరెడ్డి తెలిపారు.