88.08 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్ధసారథి ఫలితాలను విడుదల చేశారు. 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 0.24 శాతం పెరిగింది. ఈఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 11,92,076 మంది విద్యార్థులు హాజరయ్యారు.