అకాల వర్షాలకు 9 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు 9 మందిని బలితీసుకున్నాయి. ఈమేరకు ఇవాళ ప్రభుత్వం అధికారికం ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా 9 మంది మృతిచెందారని ప్రకటనలో పేర్కొంది. 9,988 హెక్టార్లలో పంటకు నష్టం కలిగిందని, మామిడి, కూరగాయలు, ఇతర పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారులు తెలిపారు. ఇండ్లు కూలిన ఘటనలో మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతిచెందారని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడిన ఘటనలో ఇద్దరు, వరంగల్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.