92పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: రిజర్వ్‌బ్యాంక్‌ పరపతి విధానంలో ఎలాంటి మార్పులు లేకపోవడం అంతర్జాతీయంగా అనుకూల ఫలితాలతో మంగళవారం స్టాక్‌మార్కెట్‌ లాభాలనార్జించింది. సెన్సెక్స్‌ 92.50పాయింట్ల ఆధిక్యంతో 17236.18వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 29.20పాయింట్ల లాభంతో 5229 పాయింట్ల వద్ద ముగిశాయి. చమురు గ్యాస్‌, ఐటీ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌, ఓఎస్‌జీసీ, స్టెరిలైట్‌, టాటామోటార్స్‌, విప్రో షేర్లకు ఆదరణ లభించింది. భారతీ ఎయిర్‌టెల్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హీరోమోటోకార్ప్‌, జిందాస్టీల్‌ తదితర కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింది.