939వ రోజుకు చేరుకున్న దీక్ష
ఆదిలాబాద్‌్, జూలై 30 :ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 939వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకు నాయకులు పని చేస్తే రాష్ట్రం సాధించేవారం అని వారు పేర్కొన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలను, నాయకులను ప్రజలు క్షేమించరని వారు హెచ్చరించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర విషయమై స్పష్టమైన ప్రకటన చేయకపోతే అగస్టు మాసంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.