ఆర్థికస్థితిని దెబ్బతీసిన డబ్బుల పందేరం
అమరావతి : వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని కోలుకోకుండా దెబ్బతీసింది. కేవలం తదుపరి అధికారం తనదే కావాలన్న లక్ష్యంతో పథకాలను అమలు చేసినా ఫలించలేదు. అయితే చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు ఎపి ఆర్థికంగా కోలుకోలేని దశకు చేరింది. ఓ వైపు విపక్ష టిడిపిని దెబ్బతీస్తూ, కేసులతో వారి క్యాడర్‌లో భయాలను పెంచడానికి
మాత్రమే పోలీస్ వ్యవస్థను, అధికార వ్యవస్థను వాడుకున్నారు. మరోవైపు నేతలపై పలు కేసులను నమోదు చేసిన్న తీరు కేవలం ఓటుబ్యాంకును పదిలం చేసుకునేవిగా ప్రజలు గుర్తించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బకొడితే రాజకీయంగా ఎదురు ఉండదన్న భ్రమలో జగన్ బోల్తాపడ్డారు. ఆయా సామాజికవర్గాల మద్దతు తనకు లభించేలా చేసిన విన్యాసాలు పనికి రాకుండా పోయాయి. హావిూల అమలు పేరిట ప్రజాధనాన్ని జగన్మోహన్‌రెడ్డి పంచిపెట్టారు. విమర్శలు వచ్చినా జగన్ మాత్రం లెక్క చేయలేదు. ఇది క్విడ్‌ఫ్రో అని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు టుగానే విమర్శించినా లెక్కచేయలేదు. దీనివల్ల ప్రజలలో తనకు మంచి పేరు వస్తుందన్న ధీమాలో ఆయన రాష్టాన్న్రి గాడి తప్పించారు. ఇప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఉందని అంటున్నారు. ఇది తీర్చడం అంత ఆషామాషీ కాదు. తెలంగాణలో కెసిఆర్, ఎపిలో జగన్ పోటీపడి అప్పులు చేసి రాష్టాల్రను గుల్ల చేశారు. విభజన తరవాత ఇలాంటి నేతల కారణంగా రెండు రాష్టాల్రు పూర్తిగా కుదలేయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించిన వారు. పాలనలో పెద్దగా మార్పు కనిపించకున్నా పథకాల పేరుతో పందేరం సాగించారని విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, పథకాల అమలు విషయంలో వెనకడుగు వేయకపోవడం జగన్మోహన్‌రెడ్డి అనుభవ రాహిత్యానికి, స్వార్థానికి పరాకాష్టగా చూడాలి. పటిష్టమైన ఓటు బ్యాంక్‌ను నిర్మించుకోవడమే ఈ పథకాల అమలు వ్యూహమని రాజకీయ విశ్లేషకులు సైతం అప్పుడే హెచ్చరించారు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఎపిలో పరిస్థి ఏర్పడిరదని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ సమర్థుడైన చంద్రబాబు దీనిని గట్టెక్కించే పనిలో పడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించక పోయినా ప్రజాధనాన్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని కొనసాగించాలన్న ఆలోచనలకు దూరంగా ఉండాలి. దివంగత వైఎస్ కూడా ఇలాగే ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అదే ఆయనను ఉమ్మడి ఎపిలో రెండోసారి అధికారంలోకి తీసుకుని వచ్చింది. అయితే అదేపనిగా ఆయన ఎప్పుడూ డబ్బుల పందేరం చేయలేదు. ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా ముందుకు తీసుకుని వెళ్లారు. పథకాల అమలుతోపాటు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బలమైన ఓటు బ్యాంకును నిర్మించు కోవడానికి జగన్ వేసిన ఎత్తుగడలు ఎలా ఉన్నా ఎపిని కలోలుకోలేని దెబ్బతీసింది. ఉపాధి, ఉద్యోగ రంగాలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక రంగం కుదేలయ్యింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించ కపోయినా ప్రజాధనాన్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని కొనసాగించారు. తద్వారా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలనీ జగన్ భావించారు. కానీ ప్రజలు అసలు విషయం గుర్తించి పాతరేశారు. మరోవైపు కెసిఆర్ మాయలోపడి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు కాపీ కొడుతూ వచ్చారు. వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదనీ సర్వత్రా విమర్శలు వచ్చినా పెడచెవిన పెట్టారు. జీతాలు చెల్లించడానికి కూడా నిధులు లేకుండా చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించి పరిష్కరించే బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై పడిరది. ఓ వైపు సంఓఏమం కొనసాగిస్తూనే అభివృద్దిని పరుగులు పెట్టించాలి. పోలవరం, రాజధాని అమరావతిలను పట్టాలకెక్కించాలి. పారిశ్రామిక పురోగతి సాధించాలి.