కారు ఢీకొని వ్యక్తి మృతి

ఏర్గట్ల మండలకేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో వ్యక్తికి కారు ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఏర్గట్ల ఏఎస్సై లక్ష్మణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన గాండ్ల నాగయ్య తన ఎక్సల్ వాహనంపై బట్టాపూర్ నుండి ఏర్గట్లకు వస్తుండగా, బట్టాపూర్ గ్రామానికి చెందిన బాలె శ్రీనివాస్ ఎక్సెల్ ను ఢీ కొనడంతో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.