రాష్ట్రంలో మరో ప్రమాదం

నవంబర్ 7 (జనం సాక్షి) తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు దూసుకెళ్లింది. హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఔషాపూర్ వద్ద ఓ కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపునకు దూసుకెళ్లింది. అవతలి పక్కన రోడ్డు చివరలో ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌చేశారు.



