సమ్మర్ క్యాంప్ శిక్షణ శిబిరంకు దరఖాస్తులు ఆహ్వానం

గంభీరావుపేట మే 09(జనం సాక్షి);గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్ స్కూల్
పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల లో ఈ నెల 11 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ ( వేసవి శిక్షణ శిబిరం) ఏర్పాటు చేయబడిందని పాఠశాల ప్రిన్సిపల్ ఎ. శ్రీలత తెలిపారు.ఇట్టి సమ్మర్ క్యాంప్ లో 6 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని – విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు. ఇట్టి సమ్మర్ క్యాంప్ లో 100 మంది విద్యార్థులు పాల్గొనడానికి అవకాశం కలదు. ఇందులో చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, యోగా, కరాటే, కంప్యూటర్ శిక్షణ, పర్సనాలిటీ డెవలప్మెంట్, సైన్స్ ప్రయోగాలు, క్విజ్ మొదలైన అంశాలు ఉంటాయి.సమ్మర్ క్యాంప్ లో పాల్గొనే విద్యార్థులకు ప్రతి రోజు స్నాక్స్ అందజేస్తారు. విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన మొదలైన లక్షణాలు పెంపొందించడానికి ఈ సమ్మర్ క్యాంప్ దోహదపడుతుంది.
మండలంలోని 6 వ తరగతి నుండి 9 వ తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఇట్టి సమ్మర్ క్యాంప్ లో ప్రవేశం పొందవచ్చు. ప్రవేశం పొందడానికి పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల దమ్మన్నపేట లో సంప్రదించాలని పాఠశాల ప్రిన్సిపల్. శ్రీలత కోరారు. ఈ ప్రవేశం పొందడానికి విద్యార్థి పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని రాగలరు
సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు. రాగలరని ప్రిన్సిపాల్ తెలిపారు.