మహబూబ్ నగర్ లో ఏటీఎం మిషన్ చోరీ

ఎస్‌బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలుఎంతకు తెగించారు ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు

మహబూబ్ నగర్ బ్యూరో మే 26(జనం సాక్షి ):మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్‌బీఐ ఏటీఎం మెషిన్‌ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. తెలంగాణ చౌరస్తాలోని రాఘవేంద్ర సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.ఏటీఎం సెంటర్‌లోకి చొరబడిన దొంగలు ముందుగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సహాయంతో మెషిన్ డోర్‌ను కట్ చేసి, ఏకంగా ఏటీఎం మెషిన్‌ను వాహనంలో ఎత్తుకెళ్లారు.ఈ ఏటీఎం మెషిన్‌లో సుమారు రూ. 50 వేల నుండి లక్ష రూపాయల వరకు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఉండొచ్చని బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు.తాజా పరిస్థితి పోలీస్ దర్యాప్తు లభ్యమైన మెషిన్: దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎం మెషిన్ బోయపల్లి శివార్లలో పారేసి ఉండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలో చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రధాన రహదారుల సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా చేసుకుని నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దొంగతనం జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తాజావార్తలు