అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేసిన బాత్క శంకర్ యాదవ్

 

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, జనవరి 28 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మహమ్మాయినగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి కాంగ్రెస్ నాయకులు బాత్క శంకర్ యాదవ్ 16 కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రీ స్కూల్ పిల్లలు, వారి తల్లిదండ్రులు, కాలనీవాసులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల విద్యా వసతుల మెరుగుదలకు ఈ సహకారం ఎంతో ఉపయోగపడుతుందని కాలనీవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పారిజాత, ఆయా సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.