ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు . గైగోల్లపల్లి గ్రామపంచాయతీలో

 పాలేరు.జనంసాక్షి. ( 09అక్టోబర్). తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక,మహిళలకు ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని. ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పుష్పలత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాల మేరకు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలోని గైగొళ్ళపల్లి గ్రామపంచాయతీలోని ఉడతలగూడెం అంగన్వాడి సెంటర్ లో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు.మొదట వివిధ రకాల పూలతో మహిళ ఉద్యోగులు బతుకమ్మను అలంకరించారు. అంగన్వాడీ టీచర్లు,మహిళ సమాఖ్య ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులను ధరించి భక్తిశ్రద్ధలతో బతుకమ్మని పేర్చి ఆటపాటలతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు.అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పలత, అంగన్వాడి టీచర్లు గుగ్గిళ్ళ యశోద ,తోడేటి పద్మ, బాధావతు బూబా. బాదావద శారద ,అంగన్వాడి ఆయా కుమ్మరి కుంట్ల వెంకటలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు..

తాజావార్తలు