గణపురం సర్పంచ్ గా బిసి బిడ్డ లావణ్యను గెలిపించుకోవాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):గణపురం సర్పంచిగా బీసీ బిడ్డ అయినా మోటపోతుల లావణ్య శంకర్ ను గెలిపించుకోవాలని బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యాధికార పార్టీ నాయకులు గట్ల రాజన్న, బీసీ ములుగు జిల్లా నాయకులు ముంజాల బిక్షపతి గౌడ్ లు అన్నారు. గణపురం మండల కేంద్రంలో శనివారం ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మోటపోతుల లావణ్య శంకర్ కు బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాల ఓటర్లందరూ నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్న లావణ్య కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని చెప్పారు. ఎక్కడ బీసీ అభ్యర్థులు ఉన్న బీసీలందరూ ఏకమై అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, వెనక్కి తగ్గకుండా పార్టీలకతీతంగా బీసీలను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు రాదండి దేవేందర్, గణపురం గౌడ సంఘం అధ్యక్షుడు మార్క మొగిలి గౌడ్, మాదాసు రవి గౌడ్, తిరుపతి, రాధాకృష్ణ, గణేష్, కిరణ్, హరీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు



