ఇంగ్లండ్‌కు పెద్ద షాక్

ఇంగ్లండ్ జ‌ట్టుకు పెద్ద షాక్. ఈ మధ్యే అత్యంత వేగ‌వంత‌మైన బంతి విసిరి రికార్డు సృష్టించిన ఆ జ‌ట్టు ప్ర‌ధాన‌ పేస‌ర్ మార్క్ వుడ్ఏడాదంతా ఆటకు దూరం కానున్నాడు. కుడి మోచేతిగాయంతో బాధ ప‌డుతున్న వుడ్ సుదీర్ఘ విశ్రాంతి తీసుకోనుండడ‌మే అందుకు కార‌ణం. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు వెల్ల‌డించాయి.‘కుడి చేతి మోచేయికి గాయం కార‌ణంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ మార్క్ వుడ్ ఈ ఏడాదంతా క్రికెట్‌కు దూరం కానున్నాడు. దాంతో, అత‌డు పాకిస్థాన్, న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌ల‌కు అందుబాటులో ఉండ‌డు. వ‌చ్చే ఏడాది ఆరంభానిక‌ల్లా వుడ్ పూర్తిగా ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశ‌ముంది. అప్ప‌డు భార‌త ప‌ర్య‌ట‌న‌తో పాటు చాంపియ‌న్స్ ట్రోఫీలో వుడ్ ఆడ‌తాడ‌ని భావిస్తున్నాం అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు’ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.