బిల్కిస్‌ బానో రేపిస్టుల క్షమాభిక్షరద్దు

https://janamsakshi.org/imgs/2024/01/Bilkis-Bano-rapists-amnesty-canceled-copy-1.jpgమళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢల్లీి: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ కేసులో 11 మంది రేపిస్టులను ముందస్తుగా రిలీజ్‌ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ సంచలన తీర్పును వెలువరించింది. క్షమాభిక్షను కోర్టు రద్దు చేయడమే కాకుండా గుజరాత్‌ ప్రభుత్వానికి ఆ అధికారం లేదని ఇవాళ సుప్రీం ధర్మాసనం స్పష్టమైన వివరణ ఇచ్చింది. జస్టిస్‌ బీవీ నాగర్నత, ఉజ్వల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్‌ చేస్తూ బిల్కిస్‌ బానో వేసిన పిటీషన్‌కు అర్హత ఉందని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది.
రేప్‌ నిందితులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని, ఆ కేసులో అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం మహారాష్ట్ర సర్కారుకు ఉందని, ఎందుకంటే అక్కడే ఆ కేసులో విచారణ జరిగిందని కోర్టు అభిప్రాయపడిరది. 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో రేప్‌కు గురైంది. ఆ సమయంలోనే ఆమె కుటుంబాన్ని కూడా కోల్పోయింది. ఆ కేసులో శిక్ష పడ్డ 11 మంది నిందితుల్ని 2022లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌ చేశారు.
క్షమాభిక్ష ద్వారా రిలీజైన వారిలో జవ్వంత్‌ నాయి, గోవింద్‌ నాయి, శైలేశ్‌ భట్‌, రాథేశ్యామ్‌ షా, బిపిన్‌ చంద్ర జోషి, కేశరిభాయ్‌ వోహనియా, ప్రదీప్‌ మోర్దియా, బాకాభాయ్‌ వోహనియా, రాజుభాయ్‌ సోని, మిటేశ్‌ భట్‌, రమేశ్‌ చందన ఉన్నారు. జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత రిలీజైనట్లు గుజరాత్‌ హోంశాఖ కార్యదర్శి రాజ్‌ కుమార్‌ గతంలో తెలిపారు. రిలీజైన తర్వాత ఆ 11 మందికి హీరోల తరహాలో వెల్కమ్‌ దక్కింది. అయితే రిలీజ్‌ను సవాల్‌ చేస్తూ బిల్కిస్‌ బానోతో పాటు మరికొంత మంది సుప్రీంను ఆశ్రయించారు.
ఇవాళ విచారణ సమయంలో జస్టిస్‌ నాగరత్న .. గుజరాత్‌ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుజరాత్‌ అపహరించినట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. క్షమాభిక్షను ఇవ్వడం అంటే అధికారాలను గుజరాత్‌ సర్కార్‌ కిడ్నాప్‌ చేసినట్లే అని తెలిపారు. మహారాష్ట్ర అధికారాన్ని గుజరాత్‌ లాగేసుకున్నట్లు ఆమె తన తీర్పులో వివరించారు. అయితే గుజరాత్‌ సర్కార్‌ తన పరిధిలో ఉన్న అధికారాన్ని వాడుకున్నట్లు కోర్టు తెలిపింది. గుజరాత్‌ సర్కార్‌ ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఈ తీర్పులో వెల్లడిరచింది.  ఒకవేళ రేప్‌ కేసు నిందితులు చట్టం ప్రకారం క్షమాభిక్ష పొందాలనుకుంటే, వాళ్లు మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రెండు వారాల్లోగా మళ్లీ నిందితులందరూ జైలులో హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పును డ్రాఫ్ట్‌ చేసిన జస్టిస్‌ భుయాన్‌కు జస్టిస్‌ నాగరత్న థ్యాంక్స్‌ తెలిపారు.