గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సరైనదే!
హైదరాబాద్ (జనంసాక్షి బ్రేకింగ్ న్యూస్) :
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేసులో సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పును తెలంగాణ హౖెెకోర్టు సమర్ధించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సరైనదేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సింగిల్ రెడ్డి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ. చేసిన అప్సీర్ను సైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పేర్కొన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అభ్యర్థులు పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు.