Monday, 9 November 2026

హైదరాబాద్

అదనపు విద్యుత్‌ కేటాయించండి

న్యూఢిల్లీ: రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ కొరత నెలకొన్నందున అదనపు విద్యుత్‌ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ విజ్ఞప్తి చేశారు. కేంద్రవిద్యుత్‌శాఖ కార్యదర్శితో ఆమె సమావేశమయ్యారు. సింహద్రి నాలుగో యూనిట్‌కు కావాల్సిన బొగ్గు సరఫరాను త్వరగా…

హుక్కా కేంద్రాల పై నిఘా: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ లో పబ్‌లు, హుక్కా కేంద్రాలపై నిఘా పెట్టినట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని హుక్కాకేంద్రాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. మైనర్లను అనుమతిస్తున్న హుక్కాకేంద్రాల పై కఠిన చర్చలు తీసుకుంటున్నట్టు కమిషనర్‌ చెప్పారు.

ప్రతేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.

కడప : రాష్ట్రం విడిపొవాల్సి వస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుచేయాలని తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. కడపలో అయన విలేకరులతో మాట్లాడుతూ ఉజ్వల చరిత్ర కలిగిన రాయలసీమను కొందరు వ్యక్తులు స్వార్థం కోసం విడగొట్టాలని…

రంగారెడ్డి జిల్లాలో విషాదం

రంగారెడ్డి:వికారాబాద్‌ మండలం మద్గుల్‌ చిటంపల్లిలో విషాదం చోటు చేసుకుంది.ఇద్దరు పిల్లలతో సహ ఓతల్లి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు తల్లి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.స్వల్ప గాయాలతో బయటపడ్డ పిల్లలను…

తెలంగాణ నేతలకు రాజకీయ జేఏసీ లేఖలు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలని డింమాడ్‌ చేస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాజకీయ జేఏసీ లేఏసీ లేఖలు రాసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని కోరారు.

రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి సాధ్యం:ఎంపీ వివేక్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో విడిపోతేనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై సానుకూల నిర్ణయం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు వివేక్‌ హాజరయ్యారు. వివేక్‌తో పాటు…

షెడ్యూల్‌ ప్రాంతంలో 1585 పోస్టులకు ప్రత్యేక డీఎస్సీ

హైదరాబాద్‌: షెడ్యూల్‌ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 1585 పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్లు మంత్రి బాలరాజు తెలిపారు. షెడ్యూల్డు ప్రాంతంలో పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపిక కోసం 9జిల్లాల్లో కలెక్టర్ల…

జడ్జిలకు 26 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో అరెస్టు అయిన జడ్డిలు ప్రభాకర్‌రావు, లక్ష్మినరసింహలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈ నెల 26 వరకు ఏసీబీ కోర్టు జ్యుడీషియాల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం వారిని జైలుకు తరలించారు.

మైనర్‌ బాలికను పెళ్ళాడిన వ్యక్తిపై ఫిర్యాదు

కడప: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్‌లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి మైనర్‌ బాలికను వివాహం చేసుకున్నాడు. కొమరవోలుకు చెందిన వెంకటసుబ్బయ్యపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కిరణ్‌ నాయకత్వాన్ని బలపరచాలి:వెంకట్రావు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం వుందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత  పాలడుగు వెంకట్రావు అన్నారు. కిరణ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇబ్బందుల్లో ఉన్నారని అయితే వాటిని అధిగిమించి మంచి నాయకునిగా ఎదిగారన్నారు. కేంద్రమంత్రివర్గంలో చేరాలని రాహుల్‌గాంధీని…